కరోనా టీకా పంపిణీ ప్రక్రియ ముందస్తు ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రంలో వ్యాక్సిన్ డ్రైరన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లక్డీకాపుల్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం నిర్వహించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు డమ్మీ వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
లక్డీకాపూల్‌లో సజావుగా సాగుతున్న వ్యాక్సిన్ డ్రైరన్ - covid vaccine dry run in hyderabad
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో డమ్మీ వ్యాక్సినేషన్ చేస్తురు. ఈ ప్రక్రియలో కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు డమ్మీ వ్యాక్సినేషన్ సజావుగా సాగుతోందని వైద్యులు వివరించారు.
covid vaccine dry run in lakdikapool global hospital
టీకా నిర్వహణలో ఎదురయ్యే లోపాలను అధిగమించడమే కాకుండా సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్యులు వివరించారు. ఈ ప్రక్రియ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు.