తెలంగాణ

telangana

By

Published : Jan 2, 2021, 12:21 PM IST

Updated : Jan 2, 2021, 12:29 PM IST

ETV Bharat / city

రాష్ట్రంలోని 7 ప్రాంతాల్లో కొవిడ్​ టీకా డ్రై రన్​

రాష్ట్రంలో కొవిడ్‌ టీకా పంపిణీకి ముందస్తు సన్నాహాల్లో భాగంగా హైదరాబాద్, మహబూబ్​నగర్​ జిల్లాల్లోని 7 ప్రాంతాల్లో శనివారం డ్రై రన్‌ నిర్వహించారు. ఒక్కో కేంద్రంలో 25-30 మంది చొప్పున ఆరోగ్య సిబ్బందిని, సాధారణ పౌరులను ఎంపిక చేసి ఈ కార్యక్రమంలో భాగస్థులను చేశారు.

రాష్ట్రంలోని 6 ప్రాంతాల్లో సాగుతున్న డ్రై రన్​
రాష్ట్రంలోని 6 ప్రాంతాల్లో సాగుతున్న డ్రై రన్​

రాష్ట్రంలో కొవిడ్‌ టీకా పంపిణీకి ముందస్తు సన్నాహాల్లో భాగంగా హైదరాబాద్​, మహబూబ్​నగర్​ జిల్లాల్లోని 7 ప్రాంతాల్లో శనివారం డ్రై రన్‌ నిర్వహించారు. హైదరాబాద్‌ జిల్లాలో తిలక్‌నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నాంపల్లిలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి, సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి, సికింద్రాబాద్​లోని గాంధీ ఆసుపత్రి ఎంపిక చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రైవేటులో నేహ షైన్‌ ఆసుపత్రిని ఎంపిక చేశారు. ఒక్కో కేంద్రంలో 25-30 మంది చొప్పున ఆరోగ్య సిబ్బందిని, సాధారణ పౌరులను ఎంపిక చేసి ఈ కార్యక్రమంలో భాగస్థులను చేశారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 10 వేల మంది వాక్సినేటర్‌లు సిద్ధంగా ఉండగా రోజుకు 10 లక్షల డోస్‌లు ఇచ్చే సామర్థ్యం తమ వద్ద ఉందని ఇప్పటికే మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.

కొవిడ్ టీకా డ్రై రన్​లో భాగస్వామ్యమైన వైద్యురాలు

ఒక ట్రయల్‌గా మాత్రమే

వ్యాక్సిన్ డ్రై రన్‌లో భాగంగా ఆయా కేంద్రాల్లో టీకా ఇచ్చే సమయంలో.. ఎదురయ్యే క్షేత్రస్థాయి సమస్యలు, సాంకేతిక సమస్యలను పరిశీలిస్తున్నారు. సాధారణంగా వాక్సినేషన్ సమయంలో కొవిన్ సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న వారు ముందుగా తమ ధ్రువపత్రాలతో వ్యాక్సిన్ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి వివరాలను సరిపోల్చుకున్న అనంతరం అధికారులు వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారు దాదాపు అరగంట సేపు వ్యాక్సిన్ కేంద్రంలో వేచి ఉండాలని.. ఆ సమయంలో వారి శరీరంలో వచ్చే మార్పులను అధికారులు గుర్తించి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ ఎంత సేపు తీసుకుంటోంది.. వ్యాక్సిన్ అమలులో ఉండే సమస్యలను గుర్తించి పరిష్కరించి... అసలైన వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే ఈ డ్రై రన్ ప్రధాన లక్ష్యం. డ్రై రన్‌లో ఎక్కడా వ్యాక్సిన్‌ని వినియోగించరు. కేవలం ఆ ప్రక్రియను ఒక ట్రయల్‌గా మాత్రమే చేసి చూస్తారు. అనంతరం ఆయా వివరాలను కొవిన్ సైట్‌లో అధికారులు పొందుపరచనున్నారు.

డ్రై రన్​లో పాల్గొన్న వైద్య సిబ్బంది

ఇవీ చూడండి: దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో టీకా డ్రై రన్​

Last Updated : Jan 2, 2021, 12:29 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details