రాష్ట్రంలో 45ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది 45 ఏళ్లు పైబడిన వారు ఉన్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించింది. ఇప్పటికే ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు సహా 45 ఏళ్లు దాటిన 10 లక్షల మందికి తొలిడోసు ఇచ్చినట్లు తెలిపింది. రోజుకు లక్ష మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో 2 వేల కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది.
45ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం - corona vaccination to above forty five years in telangana
రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వారు సుమారు 80 లక్షల మంది ఉన్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించింది.
కరోనా వ్యాక్సినేషన్, కొవిడ్ వ్యాక్సివనేషన్, కొవిడ్ టీకా
ఇప్పటివరకు 9 లక్షల 93 వేల మందికి తొలి డోసు..... 2 లక్షల 36 వేల మందికి రెండో డోసు ఇచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. రాష్ట్రంలో టీకాల వృథా కేవలం 2.01 శాతమేనని తెలిపింది.