రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమం మొదలైంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని 2 జిల్లాల్లో ప్రక్రియ చేపట్టారు. హైదరాబాద్‌లో 4, మహబూబ్‌నగర్‌లో 3 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డ్రై రన్ నిర్వహించనున్నారు. ఒక్కో కేంద్రంలో 25 మందికి వ్యాక్సిన్ ఇస్తారు.
రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ - కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ వార్తలు
08:46 January 02
హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలో డ్రైరన్
హైదరాబాద్ గాంధీ, నాంపల్లి ప్రాంతీయ ఆస్పత్రి, తిలక్‌నగర్ యూపీహెచ్‌సీ, సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో, మహబూబ్‌నగర్ జానంపేట్ పీహెచ్‌సీ, మహబూబ్‌నగర్ జీజీహెచ్, ప్రైవేట్ సెక్టార్‌లో నేహా షైన్ ఆస్పత్రిలో డ్రైరన్ ప్రక్రియ జరుగనుంది.
టీకా ఇచ్చే సమయంలో క్షేత్రస్థాయి, సాంకేతిక సమస్యలను పరిశీలిస్తారు. కొవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికే వ్యాక్సిన్ ఇస్తారు. టీకా తీసుకున్న తర్వాత అరగంట సేపు వ్యాక్సిన్ కేంద్రంలోనే వ్యాక్సినేటర్లను ఉంచుతారు. టీకా ఇచ్చిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులను గుర్తించి.. కొవిన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు.
సంబంధిత కథనాలు:దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో టీకా డ్రై రన్