Covid effect on air passengers: కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ విజృంభిస్తుందని జోరుగా జరిగిన ప్రచారం విమానరంగంపై ప్రభావం చూపింది. ఈ ఏడాది జనవరిలో విమాన ప్రయాణాలు 8.7 శాతం తగ్గినట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. గత ఏడాది జనవరిలో 1,67,33,136 మంది విమానాలల్లో ప్రయాణించగా.. ఈ ఏడాది జనవరిలో 1,52,72,179 మంది మాత్రమే ప్రయాణాలు చేసినట్లు వెల్లడించింది. మొత్తం మీద విదేశీ ప్రయాణాలు 67.5 శాతం పెరగ్గా, డొమెస్టిక్ ప్రయాణాలు 16.2 శాతం తగ్గాయి.
Covid effect on air passengers: తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లిన ప్రయాణీకుల సంఖ్య 75శాతం పెరిగింది. ఇక్కడ గత ఏడాది జనవరిలో 90,085 మంది ప్రయాణించగా, ఈ ఏడాది జనవరిలో 1,57,640 మంది ప్రయాణించినట్లు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా విజయవాడ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణీకులు జనవరి నెలలో 41.8శాతం తగ్గగా, విశాఖపట్నం నుంచి విదేశాలకు జనవరి నెలలో 530 మంది ప్రయాణించారు.