హైదరాబాద్ కోఠి ఇసామియా బజార్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కరోనా టెస్టుల కోసం ఓ వ్యక్తి వెళ్లితే తాళం వేసి ఉంది. చాలా మంది వచ్చి తిరిగి వెల్లపోయారని తెలిపారు. ఆదివారం కావడంతో నగరంలోని అన్ని ఆరోగ్య కేంద్రాలకు తాళం వేశారన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో... నిత్యం రాపిడ్ టెస్టులు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి చెప్పిన్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు.
ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టెస్టులకు ఆదివారం సెలవు! - ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టెస్టులకు ఆదివారం సెలవు!
కరోనా టెస్టుల కోసం హైదరాబాద్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లిన్నవారికి చేదు అనుభవం ఎదురైంది. కోఠి ఇసామియా బజార్‌లోని ఆరోగ్య కేంద్రాలకు తాళం వేసి ఉండటంతో అక్కడికి వెళ్లిన ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
![ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టెస్టులకు ఆదివారం సెలవు! covid test stop at primary health care centres on sunday at hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7998755-thumbnail-3x2-corona-test.jpg)
ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టెస్టులకు ఆదివారం సెలవు!
కరోనా ఉన్న వాళ్లు బయట తిరిగితే మరింత మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందన్న అతను... ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి జోక్యం చేసుకుని రోజు పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:జర జాగ్రత్త: ఆ జిల్లాల్లో రాగల మూడురోజులు భారీ వర్షాలు