Covid Test Kits: లాలాజలం ద్వారా రక్తంలో కొవిడ్ యాంటీబాడీలను తెలుసుకొనేందుకు రెండు టెస్ట్ కిట్లను హైదరాబాద్‌లోని ఓ అంకుర సంస్థ ఆవిష్కరించింది. ఇంట్లోనే సొంతంగా యాంటీబాడీలను గుర్తించేలా ఓ విధానం.. డయాగ్నస్టిక్స్ కేంద్రంలో పరీక్ష కోసం మరో విధానాన్ని కనిపెట్టింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇంకుబేషన్ కేంద్రంలోని అంకుర సంస్థ రీజీన్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీటిని ఆవిష్కరించింది.
ఫాస్ట్ ఫ్లో స్పాట్ పరీక్షను ఇంట్లోనే సొంతంగా చేసుకోవచ్చునని.. ఫలితంగా శరీరంలోని యూంటీబాడీలను గుర్తించవచ్చని సదరు అంకుర సంస్థ రిజీన్ ఇన్నోవేషన్స్ తెలిపింది. పరీక్ష కిట్‌ను ఒకసారి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో కిట్‌ను అనేక సార్లు వినియోగించి లాలాజలం ద్వారా యాంటీ బాడీలను గుర్తించేందుకు ఎలీసా అనే విధానాన్ని రూపొందించినట్లు పేర్కొంది.