తెలంగాణ

telangana

ETV Bharat / city

మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో మరోసారి టాస్క్‌ఫోర్స్ భేటీ - తెలంగాణ కొవిడ్ టాస్క్‌ఫోర్స్

కొవిడ్​ టాస్క్​పోర్స్​ రెండోసారి భేటీ అయ్యింది. ప్రగతిభవన్​లో సమావేశమైన కమిటీ... కొవిడ్ చికిత్స ఔషధాలు, ఆక్సిజన్, టీకాల సమీకరణ, సరఫరాపై సమీక్షిస్తోంది. రెమ్​డెసివిర్‌ ఇంజక్షన్ల కొరతతో పాటు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలనే డిమాండ్లపై సమావేశంలో చర్చించవచ్చని సమాచారం.

మంత్రి కేటీఆర్ నేతృత్వంలో కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సమావేశం
మంత్రి కేటీఆర్ నేతృత్వంలో కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సమావేశం

By

Published : May 14, 2021, 3:13 PM IST

ప్రగతిభవన్‌లో కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సమావేశమైంది. మంత్రి కేటీఆర్​ నేతృత్వంలో కొవిడ్ టాస్క్‌ఫోర్స్ భేటీ కొనసాగుతోంది. కొవిడ్ చికిత్స ఔషధాలు, ఆక్సిజన్, టీకాల సమీకరణ, సరఫరాపై సమీక్షిస్తున్నారు. రెండు రోజుల క్రితం సమావేశమైన టాస్క్‌ఫోర్స్ పలు నిర్ణయాలు తీసుకుంది.

కొవిడ్ నియంత్రణ, చికిత్సలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మెరుగైన స్థితిలో ఉందని... రాబోయే 3 నెలల కోసం అవసరమైన ఔషధాలన్నింటినీ సమీకరించుకుంటున్నామని కొవిడ్‌ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్, మంత్రి కేటీఆర్​ తెలిపారు. బ్లాక్ ఫంగస్ విషయంలోనూ అప్రమత్తంగా ఉన్నామన్నారు.

నిన్న ట్విట్టర్‌ ద్వారా ఆస్క్‌ కేటీఆర్​ పేరిట నెటిజన్లతో మాట్లాడిన మంత్రి.. అందులో కొంతమంది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపైనా టాస్క్‌ఫోర్స్‌ భేటీలో చర్చించే అవకాశం ఉంది. రెమ్​డెసివిర్‌ ఇంజక్షన్ల కొరతతో పాటు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలనే డిమాండ్లు వినిపించగా వాటిపైనా దృష్టిసారించవచ్చని సమాచారం.

ఇదీ చూడండి: స్పుత్నిక్-వి టీకా తొలి డోసు ఇచ్చిన డాక్టర్ రెడ్డీస్

ABOUT THE AUTHOR

...view details