మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం - covid Task Force Committee
16:34 May 12
రాష్ట్రస్థాయి కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం
కొవిడ్‌పై ఏర్పాటైన రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ మొదటి సారి సమావేశమైంది. పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి అధ్యక్షతన సచివాలయంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితులతో పాటు... వైరస్‌ను ఎదుర్కొనేందుకు చేపడుతున్న చర్యలపై సమావేశంలో చర్చిస్తున్నారు. కొవిడ్ చికిత్సకు అవసరమయ్యే ఔషధాలు, వైద్యసామగ్రి, నిల్వలు, అవసరాలపై టాస్క్‌ఫోర్స్ సమీక్షిస్తోంది. అవసరమైన ఔషధాలు, సామగ్రి సమీకరణ, సరఫరా విషయమై చర్చిస్తున్నారు.
సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు కమిటీ సభ్యులైన జయేష్ రంజన్, వికాస్‌రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా, సీఎంఓ ప్రత్యేకాధికారి రాజశేఖర్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణకు తాళం.. కొనసాగుతున్న లాక్‌డౌన్