రోజుకు దాదాపు 13వేల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు అలిపిరి సమీపంలోనే పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తున్నారు. తిరుమలలో కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో భద్రతా సిబ్బంది, మంగళ వాద్యాల కళాకారులు ఉండటంతో తితిదే అప్రమత్తమైంది. గడచిన వారం రోజుల్లో తిరుమలలో విధులు నిర్వహిస్తున్న17 మంది కరోనా బారిన పడ్డారు.
భక్తుల ద్వారా తితిదే సిబ్బందికి కరోనా వైరస్ సంక్రమించలేదని గుర్తించిన తితిదే... ఉద్యోగుల నుంచి నమూనాలను విస్తృత స్థాయిలో సేకరించాలని నిర్ణయించారు. రోజుకు వంద మంది నుంచి కరోనా పరీక్షల కోసం స్వాబ్స్ సేకరించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.