ఏపీలోని అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో పడకలు లేక కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క కొవిడ్ పరీక్షల కోసం వస్తున్న జనం సర్వర్ పనిచేయకపోవడం వల్ల నిరీక్షించాల్సి వస్తోంది. ఎక్కువ మొత్తంలో జనం రావడంతో భౌతిక దూరం పాటించలేని పరిస్థితులూ ఏర్పడుతున్నాయి. కరోనా ఉన్న లేకున్నా ఆస్పత్రికి వస్తే కరోనా అంటుకునే పరిస్థితి ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా యంత్రాంగం సర్వర్ సమస్యను పరిష్కరించి… వెంటనే పరీక్షా ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కరోనా బాధితులు కొంతమంది నేలపైనే నిరీక్షిస్తున్నారు. మరికొంతమంది కుర్చీలలో ఆక్సిజన్ అందుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు పడకలు ఖాళీ అవుతాయా.. తమకు పడక ఎప్పుడు దొరుకుతుందా అని వేచి చూస్తున్నారు.