తెలంగాణ

telangana

ETV Bharat / city

నగదు పేమెంటే కావాలన్నారు.. నడిరోడ్డుపైనే ప్రాణాలు పోయాయి. - రాజంలో ఆసుపత్రి ఎదుట మహిళ మృతి

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో సకాలంలో వైద్యం అందక ఓ కరోనా రోగి మరణించింది. సరైన సమాయానికి ఆసుపత్రికి చేరకో.. ఆక్సిజన్ అందకో.. లేక వారి దగ్గర డబ్బులు లేకనో కాదు..! నగదు రూపంలో డబ్బులు లేకపోవడం వల్ల ఆమె మరణించింది. అకౌంట్​లో డబ్బును ఆన్​లైన్ పేమెంట్ చేస్తామన్నా పట్టించుకోని ఆసుపత్రి నిర్వాకం వల్ల చనిపోయింది. నగదు కోసం.. ఆమె కూతురు ఏటీఎంల చుట్టూ తిరిగి వచ్చే సరికే తల్లి చనిపోయింది.

covid patient died with corona at rajam in east godavari
covid patient died with corona at rajam in east godavari

By

Published : Apr 28, 2021, 8:08 PM IST

నగదు పేమెంటే కావాలన్నారు.. నడిరోడ్డుపైనే ప్రాణాలు పోయాయి.

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రాజాంలో అమానవీయ ఘటన జరిగింది. డబ్బులు ఉన్నప్పటికీ అవి వాడుకునే పరిస్థితి లేకపోవడంతో కరోనా బాధితురాలు నడిరోడ్డుపై కన్నుమూసింది.

నగదు ఇస్తేనే చేర్చుకుంటాం..

కరోనా సోకిన అంజలి అనే మహిళను జిల్లాలోని జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆస్పత్రికి బంధువులు తీసుకువచ్చారు. అయితే నగదు చెల్లిస్తేనే ఆడ్మిట్​ చేసుకుంటామని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. ఫోన్ పే, గూగుల్ పే లాంటి ఆన్‌లైన్ పేమెంట్‌ను కూడా ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక డబ్బు కోసం బాధితురాలి బంధువులు ఏటీఎంల చుట్టూ 3 గంటలు తిరిగారు. ఈలోగా ఊపిరి ఆడక బాధితురాలు నడిరోడ్డుపై ప్రాణాలు విడిచింది. కేర్ ఆస్పత్రి సిబ్బంది వైఖరి పట్ల మృతురాలి బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా ఆన్‌లైన్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్న ఈ కాలంలో ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే అంటూ ప్రజల ప్రాణాలు తీయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి:వచ్చే మూడు, నాలుగు వారాలు కీలకం: డీహెచ్‌ శ్రీనివాస్‌

ABOUT THE AUTHOR

...view details