తెలంగాణ

telangana

ETV Bharat / city

పొరుగు సేవల సిబ్బంది సమ్మె.. గాంధీలో కరోనా రోగి మృతి - కరోనా సోకిన వ్యక్తి మృతి

గాంధీ ఆస్పత్రిలో రోజుకో దారుణం వెలుగు చూస్తోంది. తాజాగా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో మరో కరోనా రోగి మృత్యువాత పడ్డాడు. శ్రీధర్ అనే వ్యక్తి నాలుగు రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే అతను చికిత్స కోసం రెండు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రిలో చేరాడు. కరొనా టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే గాంధీలో ఆక్సిజన్ కొరత వల్ల అతనికి ఆక్సిజన్ పెట్టలేదు. ఫలితంగా బాధిత వ్యక్తి శ్రీధర్ బుధవారం మృతి చెందాడు.

గాంధీలో ఆక్సిజన్​ కొరత!.. కరోనా సోకిన వ్యక్తి మృతి
గాంధీలో ఆక్సిజన్​ కొరత!.. కరోనా సోకిన వ్యక్తి మృతి

By

Published : Jul 15, 2020, 9:49 PM IST

గాంధీ ఆస్పత్రిలో రోజుకో దారుణం వెలుగు చూస్తోంది. తాజాగా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో మరో కరోనా రోగి మృత్యువాత పడ్డాడు. కర్నూలు జిల్లాకు చెందిన శ్రీధర్​ హైదరాబాద్​లో నివాసముంటున్నాడు. శ్రీధర్​కు నాలుగు రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నాడు. అతను చికిత్స కోసం రెండు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రిలో చేరాడు. కరొనా టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే గాంధీలో ఆక్సిజన్ కొరత వల్ల అతనికి ఆక్సిజన్ పెట్టలేదు. ఫలితంగా బాధిత వ్యక్తి శ్రీధర్ బుధవారం మృతి చెందాడు.

ఉస్మానియాలో ఉన్నన్ని రోజులు ఆక్సిజన్ పెట్టి చికిత్స అందించారని, గాంధీలో మాత్రం ఆక్సిజన్ పెట్టకుండా నిర్లక్ష్యం చేయడంతో మృతి చెందాడని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్​ రాజారావు వివరణ ఇచ్చారు. పొరుగు సేవల విభాగం ఉద్యోగులు సమ్మె బాట పట్టడం మూలంగా సిబ్బంది కొరత ఏర్పడిందని, అందరు రోగులను చూసుకోవడం ఇబ్బందికరంగా మారడం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు. గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details