ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 9లక్షల కొవిషీల్డ్, 76, 140 కొవాగ్జిన్ టీకా డోసులు వచ్చాయి. పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. దిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 75 బాక్సుల్లో రాష్ట్రానికి టీకా డోసులు చేరుకున్నాయి.
VACCINATION: ఏపీకి చేరిన తొమ్మిది లక్షల కొవిషీల్డ్ టీకాలు - corona vaccine latest news
తొమ్మిది లక్షల కొవిషీల్డ్, 76,140 కొవాగ్జిన్ టీకా డోసులు ఏపీ రాష్ట్రానికి చేరాయి. గన్నవరం విమానాశ్రయంలోని నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్లను తరలించారు.
ఏపీకి చేరిన తొమ్మిది లక్షల కొవిషీల్డ్ టీకాలు
తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు వ్యాక్సిన్ తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్ పంపనున్నారు. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం కలిగింది.
ఇదీ చదవండి:Cabinet Sub-Committee: నిధుల సమీకరణపై అప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిక