covid cases in vijayawada government hospital: ఏపీలోని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపింది. ఆసుపత్రిలో మొత్తం 50 మందికి కరోనా నిర్ధరణ అయింది. ఇందులో ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇతర వైద్యులకు పాజిటివ్‌గా తేలింది. వీరితోపాటు 25 మంది జూనియర్ వైద్యులు, పలువురు పారామెడికల్ సిబ్బందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.
కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి..
Corona cases in India: మరోవైపు దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు.. 2,38,018 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 310 మంది మరణించారు. 1,57,421 మంది కోలుకున్నారు. కరోనావ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు:3,76,18,271
- మొత్తం మరణాలు:4,86,761
- యాక్టివ్ కేసులు:17,36,628
- మొత్తం కోలుకున్నవారు:3,53,94,882
Omicron Cases In India
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,891కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.