రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా మరో 394 మందికి కొవిడ్ సోకింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 81 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 3,03,118కి చేరింది.
కొవిడ్ ఉద్ధృతి.. రాష్ట్రంలో మరో 394 కేసులు, 3 మరణాలు - number of corona cases in telangana
రాష్ట్రంలో కొవిడ్ కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. శనివారం.. 64,898 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 394 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
పెరుగుతున్న కొవిడ్ కేసులు.. తాజాగా 394కి పాజిటివ్
మహమ్మారి బారినపడి మరో ముగ్గురు మరణించగా.. మొత్తం మృతిచెందినవారి సంఖ్య 1,669కి చేరింది. కరోనా నుంచి కోలుకొన్న మరో 194 మంది బాధితులు ఇళ్లకుచేరారు. ప్రస్తుతం 2,804 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్‌లో 1,123 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో నిన్న 64,898 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.