తెలంగాణ

telangana

ETV Bharat / city

క్రమంగా పెరుతున్న కేసులు.. రాజధాని నుంచే రాష్ట్ర నలుమూలకు - telangana covid update

హైదరాబాద్‌లో కరోనా రోజురోజుకు తీవ్రరూపు దాలుస్తోంది. ఇప్పటివరకూ కొన్ని ప్రాంతాలకే పరిమితమైన మహమ్మారి.. జంటనగరాల్లోని మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తోంది. తెలంగాణలోని జిల్లాలకూ క్రమంగా వైరస్‌ విస్తరిస్తుండడంతో అధికారులు కట్టడి చర్యలను ముమ్మరం చేశారు.

Ghmc_Roundup
Ghmc_Roundup

By

Published : May 30, 2020, 10:01 PM IST

హైదరాబాద్‌లో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. ఉస్మానియా వైద్య కళాశాలలో పీజీ విద్యార్థినికి కరోనా నిర్ధారణ కాగా ఇదే కళాశాలలో ఉన్న వైద్యుడి రూమ్‌మెట్‌కు కూడా వైరస్‌ సోకింది. అంబర్‌పేట్‌లో ఇవాళ 8 పాజిటివ్ కేసులు నమోదవ్వగా అందులో అంబర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ కుటుంబసభ్యులు ఐదుగురు ఉన్నారు. నేరెడ్‌మెట్‌లో ఓ కానిస్టేబుల్‌కు కరోనా సోకగా.. కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో పనిచేసే ఇద్దరికి వైరస్‌ సోకింది.

నలుగురు జర్నలిస్ట్​లకు

కుత్బూల్లాపూర్‌లో 4 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఆసిఫ్‌నగర్‌లో 8 ఏళ్ల బాలిక మహమ్మారి బారినపడింది. హబీబ్‌నగర్‌లో ఇద్దరికి కరోనా సోకగా సైదాబాద్‌లో ఓ మహిళకు కొవిడ్‌ సోకింది. నిన్న 20 మంది మీడియా ప్రతినిధులకు వైద్య పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మంగళహట్‌కు చెందిన 54 ఏళ్ల వ్యక్తి... గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

రేపు కూడా నమూనాల సేకరణ..

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదర్‌పల్లిలో 13 నెలల చిన్నారికి కరోనా సోకగా, రంగారెడ్డినగర్‌లో ఒకరికి, వికారాబాద్ జిల్లా తాండూరులో ఒక కేసు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో ఐసీఎంఆర్​ నేతృత్వంలో నేషనల్ న్యూట్రేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో.. 5 కంటైన్‌మెంట్‌ జోన్లలో రాండమ్ సీరం పరీక్షలు నేడు ప్రారంభంకాగా ఆదివారం కూడా నమూనాల సేకరణ ప్రక్రియ కొనసాగనుంది.

నెలన్నర పసిబిడ్డ మృతి..

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చాలా రోజుల తర్వాత రెండు కేసులు బయటపడగా అధికారులు చర్యలు చేపట్టారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నెలన్నర వయసున్న బాబు కొవిడ్‌ సోకి మరణించాడు. అతడి సోదరుడు కూడా కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. వనపర్తి జిల్లాలోనూ ఓ యువకుడికి కరోనా నిర్ధారణ కాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య రెండుకు పెరిగింది. మూసానగర్ కాలనీకి చెందిన వ్యక్తికి నిన్న కరోనా నిర్ధారణ కాగా... శనివారం అతడి భార్యకు కూడా వైరస్‌ సోకినట్లు తేలింది. కరోనా లక్షణాలతో బాధపడే వారిని గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి:లక్షణాలు లేకున్నా.. 28శాతం మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details