రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు - cases
09:16 August 01
రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకూ కొత్తగా 2,083 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం వైరస్ సోకిన వారి సంఖ్య 64,786కి చేరింది. శుక్రవారం మరో 11 మంది మృతి చెందగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 530కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 578 మంది, రంగారెడ్డి జిల్లాలో 228 మంది వైరస్ బారిన పడ్డారు.
కొవిడ్ నుంచి కొలుకుని తాజాగా 1114 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 46,502 మంది కోలుకోగా.. 17,754 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 11,359 మంది హోమ్/ఇనిస్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.