తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 1,286 మందికి కరోనా పాజిటివ్​

రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 1,286పాజిటివ్ కేసులు నిర్ధరణయ్యాయి . మొత్తం బాధితుల సంఖ్య 68వేల 946కు చేరింది. మరో 12 మంది వైరస్‌తో మృతి చెందగా... మొత్తం వైరస్‌ మరణాల సంఖ్య 563కు చేరుకుంది. జీహెచ్​ఎంసీ చుటుపక్కల జిల్లాలతో పాటు కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వైరస్‌ ఉగ్రరూపం చూపెడుతోంది.

రాష్ట్రంలో కొత్తగా 1,286 మందికి కరోనా పాజిటివ్​
రాష్ట్రంలో కొత్తగా 1,286 మందికి కరోనా పాజిటివ్​

By

Published : Aug 4, 2020, 7:28 PM IST

రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,286 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో బాధితుల సంఖ్య 68,946కు చేరింది. మరో 12 మంది మహమ్మారికి బలయ్యారు. ఈ మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 563కు చేరింది. తాజాగా 1,066 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా... ఇప్పటివరకు 49,675మంది మహమ్మారిని జయించారు. ప్రస్తుతం 18,708 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 13,787 శాంపిళ్లను పరీక్షించగా తాజా 1286 కేసులు నిర్ధరణ అయ్యాయని వైద్యా ఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. మరో 919 మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 5, 01,025 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశామని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.


1286 కేసుల్లో 903 ఆ జిల్లాలివే..

తాజా 1286 కేసుల్లో 903.. సుమారు 70శాతం కేసులు...గ్రేటర్​ సహా 8 జిల్లాల్లోనే వెలుగుచూశాయి. జీహెచ్​ఎంసీ పరిధిలోనే 391 మంది వైరస్‌ బారినపడ్డారు. రంగారెడ్డి 121, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 72 మందికి కొవిడ్‌ సోకింది. గతం వారం రోజులుగా భారీ కేసులు నమోదైన సంగారెడ్డి జిల్లాలో తాజాగా కేవలం 15 కేసులే నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరీంనగర్‌ జిల్లాలో ఆదివారం కొంచెం తక్కువ కేసులు నమోదుకాగా...సోమవారం మళ్లీ 101 మందికి పాజిటివ్‌గా నిర్ధరించారు. గత నెల 26 నుంచి ఈ నెల ఒకటి వరకు రోజూ 100కు తగ్గకుండా కేసులు నమోదైన వరంగల్ అర్బన్‌ జిల్లాలో.. రెండు రోజులుగా సంఖ్య తగ్గుతుండటం జిల్లావాసులకు ఊరటనిస్తోంది. తాజాగా వరంగల్‌ అర్బన్‌లో 63 మందికి వైరస్‌ సోకింది. నిజామాబాద్‌ జిల్లాలో 59, జోగులాంబ గద్వాల జిల్లాలో 55 మందికి పాజిటివ్‌గా నిర్ధరించారు. ఖమ్మం 41 భద్రాద్రి కొత్తగూడెం 38, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 39 కొవిడ్‌ కేసులు బయటపడ్డాయి. నాగర్‌ కర్నూల్ , నల్గొండ , పెద్దపల్లి జిల్లాల్లో 29 చొప్పున పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. మహబాబాబాద్‌ 27, సూర్యాపేట 23, జగిత్యాల 22, మంచిర్యాల జిల్లాలో 21 మందికి వైరస్ సోకింది. మిగిలిన జిల్లాల్లో 20లోపే వైరస్‌ బాధితులు ఉన్నారు.

తెలంగాణలో కరోనా వైరస్ అప్డేట్​


84 శాతం కేసుల్లో..

వైరస్‌ సోకినంత మాత్రాన ఎవరూ చనిపోరని.. ప్రజలు భయాందోళనకు గురికావద్దని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో 72 శాతం మంది బాధితులు కరోనా నుంచి కోలుకుంటున్నారని తెలిపింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న 84 శాతం కేసుల్లో ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవని పేర్కొంది. రాష్ట్రంలో ప్రతి వందమందిలో ఒకరికంటే తక్కువే వైరస్‌కు బలవుతున్నారని తెలిపింది. ప్రభుత్వాసుపత్రుల్లో 17,867 ఐసోలేషన్‌, ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.


ఇవీ చూడండి:'ఆ మరణాల లెక్కలు చెబితేనే కరోనా ప్రభావంపై స్పష్టత'

ABOUT THE AUTHOR

...view details