రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రుల్లో కొవిడ్ కేసులకు చికిత్స అందించాలని అత్యవసరమైన వారిని మాత్రమే గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డాక్టర్ రమేష్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఈనెల 21 నుంచి గాంధీలో నాన్ కొవిడ్ సేవలు ప్రారంభించాలని డీఎంఈ ఆదేశాలు ఇచ్చారు. ఫలితంగా గాంధీలో కొవిడ్ రోగుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
గాంధీ ఆస్పత్రిలో తగ్గనున్న కొవిడ్ రోగుల సంఖ్య! - judas strike withdran in gandhi hospital
అన్ని బోధనాస్పత్రుల్లో కొవిడ్ చికిత్స అందించాలని.. కేవలం అత్యవసర కేసులు మాత్రమే గాంధీకి పంపాలని డీఎంఈ తాజా ఆదేశాలు జారీచేశారు. ఫలితంగా గాంధీలో కొవిడ్ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
గాంధీ ఆస్పత్రిలో తగ్గనున్న కొవిడ్ రోగుల సంఖ్య!
కొవిడ్ నోడల్ కేంద్రాన్ని గాంధీ నుంచి టిమ్స్‌కి మార్చాలని డిమాండ్ చేస్తూ గత ఆరు రోజులుగా జూడాలు ధర్నా చేశారు. ఇవాళ.. డీఎంఈ కార్యాలయం ఎదుట భైఠాయించి నిరసన తెలిపారు. జూడాలతో చర్చలు జరిపిన డీఎంఈ.. తాజా ఆదేశాలిచ్చారు. గత ఆరు రోజులుగా జూడాలు చేస్తున్న ధర్నాను విరమించినట్లు ప్రకటించారు.
ఇవీచూడండి:కరోనా టీకా సామర్థ్యం ఎలా ఉందంటే..!
Last Updated : Nov 17, 2020, 8:06 PM IST