తెలంగాణ

telangana

ETV Bharat / city

కొవాగ్జిన్ ప్రయోగానికి కేజీహెచ్​లో రంగం సిద్ధం - covaxin latest news

విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు రంగం సిద్ధమవుతోంది. భారత్ బయోటెక్ సంస్థ సిద్ధం చేసిన కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ కోసం 100 మంది వాలంటీర్లను ఎంపిక చేయనున్నారు. ఆచార్య కేబీజీకే తిలక్ నేతృత్వంలో కమిటీ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతిచ్చిన అనంతరం పరీక్షలు ప్రారంభించనున్నారు.

covaxin
covaxin

By

Published : Jul 24, 2020, 10:04 AM IST

విశాఖ కేజీహెచ్​లో కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి. భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్ టీకాను మనుషులపై ప్రయోగించనున్నారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఇప్పటికే ట్రయల్స్ మొదలయ్యాయి. కేజీహెచ్ వైద్యులు డాక్టర్ వేణుగోపాల్ నేతృత్వంలో క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి. తొలిదశలో 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు గల 100 మంది వాలంటీర్లపై టీకా ప్రయోగిస్తారు.

ఆరు నెలలు పట్టే అవకాశం

నైతిక విలువల కమిటీ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ తిలక్ నేతృత్వంలో క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఎథిక్స్ కమిటీలో వైద్య నిపుణులు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్, కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్​ సభ్యులుగా ఉంటారు. వైద్య విద్యా సంచాలకులు నుంచి కూడా అనుమతులు వచ్చిన తర్వాత మానవ ప్రయోగాలు ప్రారంభమవుతాయి. తొలివిడత ట్రయల్స్ నెల రోజుల్లో పూర్తవుతాయి. తర్వాత రెండో దశ పరీక్షలు ఆరంభమవుతాయి. ఈ దశలో 12 నుంచి 65 ఏళ్ల వయసు గల 150 మంది వాలంటీర్లను గుర్తించి వారికి టీకా వేస్తారు.

టీకా ప్రయోగ విషయాలను భారత డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్​కు నివేదిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఆరు నెలల సమయం పెట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:'రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశ.. అప్రమత్తంగా ఉండాలి'

ABOUT THE AUTHOR

...view details