జంతువులపై కొవాగ్జిన్ ప్రయోగాలు సత్ఫలితాలిచ్చాయని భారత్ బయోటెక్ ప్రకటించింది. వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో ఇమ్యూనిటీ గణనీయంగా పెరిగిందని పేర్కొంది. వ్యాక్సిన్‌తో ఎలాంటి ప్రతికూల ప్రభావం కలగలేదని ట్వీట్ చేసింది.
జంతువులపై కొవాగ్జిన్ సత్ఫలితాలిచ్చింది: భారత్ బయోటెక్ - కొవాగ్జిన్ భారత్ బయోటెక్ ప్రయోగాలు
భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. కొవాగ్జిన్ ప్రయోగాలు సత్ఫాలితాలిచ్చాయని సంస్థ పేర్కొంది. వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో వ్యాధి నియంత్రణ అద్భుతంగా ఉందని తెలిపింది.
bharat biotech
వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో వ్యాధి నియంత్రణ అద్భుతంగా ఉందని వెల్లడించింది. రెండో డోస్ ఇచ్చిన 14 రోజుల తర్వాత పరిశీలించినట్లు తెలిపింది. ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్ వృద్ధిని నియంత్రించినట్లు గుర్తించామని వివరించింది. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన భారత్ బయోటెక్.. ఇటీవలే నిమ్స్‌లో రెండోదశ ట్రయల్స్ ప్రారంభించింది.
ఇదీ చదవండి:నూతన రెవెన్యూ చట్టం ఆరంభం మాత్రమే: కేసీఆర్