కోర్టుల్లో లాక్డౌన్ జులై 20 వరకూ పొడిగింపు - హైకోర్టు తాజా వార్తలు
21:07 June 27
కోర్టుల్లో లాక్డౌన్ జులై 20 వరకూ పొడిగింపు
కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని న్యాయస్థానాల లాక్డౌన్ జులై 20వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు, జిల్లా, మేజిస్ట్రేట్ కోర్టులు, ట్రైబ్యునల్స్లో సాధారణ విచారణ ప్రక్రియను జులై 20 వరకు నిలిపి వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది.
ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, బెయిల్, స్టే వంటి పిటిషన్లతో పాటు కూల్చివేతలు, విద్యుత్ నిలిపివేత వంటి అత్యవసర వ్యాజ్యాలు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో పిటిషన్లను ఆన్లైన్ లోనే స్వీకరించాలని.. నేరుగా దాఖలు చేసే విధానం అమలు చేయవద్దని స్పష్టం చేసింది.