ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇవ్వడంతో... ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ఏపీ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో సీఎం జగన్ చర్చించారు. ఎన్నికలపై హైకోర్టు స్టే అంశం సహా భవిష్యత్ కార్యాచరణపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రత్యేకంగా సీఎం చర్చించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై వీలైనంత త్వరగా డివిజన్ బెంచ్‌కు వెళ్లాలని ఎస్ఈసీని ప్రభుత్వం కోరుతున్నట్టు సజ్జల తెలిపారు.
పరిషత్ ఎన్నికల తదుపరి కార్యాచరణపై ఏపీ సీఎం చర్చలు - High Court stay on Parishad elections news
ఏపీ పరిషత్ ఎన్నికలపై హైకోర్టు విధించిన స్టే పై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడారు.
హైకోర్టు స్టే
కొవిడ్ విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు పూర్తయితే చాలా మేలు జరిగేదన్నారు. త్వరగా ఎన్నికలు ముగియడం సహా వాక్సినేషన్ త్వరగా పూర్తి చేసేందుకు అవకాశం ఉండేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు అడ్డంకులు సృష్టించడం అన్యాయమని పేర్కొన్నారు. డివిజన్ బెంచ్‌లో ఎస్ఈసీకి అనుకూలంగా తీర్పు రావాలని కోరుకుంటున్నట్లు సజ్జల తెలిపారు. డివిజన్ బెంచ్‌లోనూ ఎన్నికలు కాదంటే తాము చేయగలగిందేమీ లేదన్నారు. జరుగుతున్న పరిణామాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని సజ్జల వ్యాఖ్యానించారు.