YS Sharmila case: విజయమ్మ, షర్మిలకు కోర్టులో ఊరట - YS Sharmila case
15:22 September 30
ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు కొట్టేసిన కోర్టు
ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో విజయమ్మ, షర్మిలకు ఊరట దొరికింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012 సమయంలో పరకాల ఉపఎన్నికల్లో భాగంగా... అనుమతి లేకుండా సభ నిర్వహించారని విజయమ్మ, షర్మిలతో పాటు కొండా సురేఖ, కొండా మురళీ తదితరులపై కేసు నమోదైంది.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణపై.. ప్రజాప్రతినిధుల కోర్టులో విజయమ్మ, షర్మిలపై కేసు నమోదయింది.
అప్పటి నుంచి వాయిదాలు పడుతూ వస్తున్న కేసును ఎట్టకేలకు కోర్టు కొట్టివేసింది. కొండా సురేఖ, కొండా మురళి సహా 9 మందిపై ఉన్న కేసును న్యాయస్థానం కొట్టివేసింది.
ఇదీ చూడండి: