Couple Suicide in AP: పిల్లలను చదివించి, ఉన్నత విద్యను అందించాలనే సంకల్పం నెరవేర్చుకున్నారు. అందుకోసం ఇంటా బయటా ఎన్నో అప్పులు చేశారు. తీరా చూస్తే ఆ అప్పులే వారి ప్రాణాలను తీసుకున్నాయి. పిల్లల భవిష్యత్ చూడకుండానే బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల బాధ తాళలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో చోటుచేసుకుంది.
ఉద్యోగం కోసం పిల్లలను అమెరికా పంపారు.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు - ap latest news
Couple Suicide in AP: ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించి అమెరికా పంపిన తల్లిదండ్రులు.. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. సొంతూరిలో ఉంటూ రైస్ మిల్లు నిర్వహిస్తున్న వారు.. అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో అప్పుల బాధ తట్టుకోలేక గోపవరపు వెంకటేశ్వర్లు, అంజనాదేవీ దంపతులు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరూ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారు. కొంతకాలంగా వెంకటేశ్వర్లుకు వ్యాపారంలో నష్టం వాటిల్లింది. ఫలితంగా అప్పులు చేశాడు. వ్యాపారంలో వచ్చిన నష్టభారం తగ్గకపోగా.. అప్పుల బాధ మరింత ఎక్కువయ్యింది. దీంతో దంపతులిద్దరూ శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: