మాజీ రాష్ట్రపతి, సీనియర్ రాయకీయ నాయకులు ప్రణబ్ ముఖర్జీ మృతికి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం ప్రకటించారు. రాజకీయవేత్తగా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయకు ప్రణబ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేవారని గుత్తా తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న కాలంలో నిరాశ పరచకుండా ప్రోత్సహించేవారని ఆయన చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్థించారు.
ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు: గుత్తా - Gutta Sukhender Reddy condoles death of Pranab Mukherjee
మాజీ రాష్ట్రపతి, రాజకీయ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ప్రణబ్ ముఖర్జీ మృతి దేశానికి తీరని లోటు అని అన్నారు.
![ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు: గుత్తా Council Chairman Gutta Sukhender Reddy condoles death of Pranab Mukherjee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8630644-536-8630644-1598892946969.jpg)
ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు: గుత్తా సుఖేందర్ రెడ్డి