తెలంగాణ

telangana

ETV Bharat / city

పత్తి రైతులకు షాక్.. మద్దతు ధర రూ.50 తగ్గింపు.. - telangana cotton crop

తెలంగాణలో పత్తి రైతులకు సీసీఐ షాకిచ్చింది. నాణ్యంగా లేదంటూ ఈనెల 12 నుంచి మద్దతు ధరను రూ.50 తగ్గిస్తున్నట్లు భారత పత్తి సంస్థ (సీసీఐ) ప్రకటించింది.

Cotton support price reduced by Rs.50
పత్తి మద్దతు ధర రూ.50 తగ్గింపు

By

Published : Nov 8, 2020, 9:33 AM IST

రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వస్తున్న పత్తి నాణ్యంగా లేదనే కారణంతో సోమవారం నుంచి మద్దతు ధర రూ.50 తగ్గిస్తున్నట్లు భారత పత్తి సంస్థ(సీసీఐ) తెలిపింది. ఈ మేరకు తెలంగాణ మార్కెటింగ్‌శాఖకు లేఖ రాసింది.

ఇప్పటివరకు తేమ 8-12 శాతం లోపు ఉండి పింజ పొడవు 30 మి.మీ.పైన ఉండే పత్తికి క్వింటాలుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5,825 మద్దతు ధరను సీసీఐ చెల్లిస్తోంది. వర్షాల కారణంగా పింజ పొడవు 30 మి.మీ. రావడం లేదని, ఈ నేపథ్యంలో బీబీ స్పెషల్‌ గ్రేడ్‌ పేరిట క్వింటాలుకు రూ.5,775 ధర చెల్లించనున్నట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details