భారత్‌బంద్‌లో భాగంగా షాపు మూసేయాలంటూ తెరాస నేతలు దాడి చేశారని హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ దుకాణదారు ఆరోపించారు. శ్రీ సాయి బ్యూటీ సెంటర్‌కు వచ్చిన తెరాస కార్పొరేటర్ ఎడ్ల భాగ్యలక్ష్మి భర్త హరి బాబు సహా అనుచరులు దాడి చేశారని వాపోయారు.
బ్యూటీ సెంటర్‌పై కార్పొరేటర్ భర్త, అనుచరులు దాడి - ముషీరాబాద్‌లో బ్యూటీ సెంటర్‌పై దాడి
భారత్ బంద్‌లో భాగంగా... హైదరాబాద్ ముషీరాబాద్ డివిజన్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీ సాయి బ్యూటీ సెంటర్‌పై తెరాసకు చెందిన కార్పొరేటర్ భర్త... అనుచరులతో వచ్చి దాడి చేసినట్టు యజమాని ఆరోపించారు.
బ్యూటీ సెంటర్‌పై కార్పొరేటర్ భర్త, అనుచరులు దాడి
దుకాణంలో అద్దాలు, టీవీ, సీసీకెమెరా ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ వద్ద భాజపా కార్యకర్తలు ధర్నా చేశారు. దాడి చేసిన తెరాస నేతలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.