ముందు టికెట్ ప్రకటించి... వేరే వాళ్లకు అమ్ముకోవడం అన్యాయమని లంగర్‌హౌస్ తెరాస కార్యకర్త పద్మయాదవ్ అన్నారు. కార్వాన్ తెరాస ఇంఛార్జ్ ఠాకూర్ జీవన్ సింగ్... రూ.10 లక్షలు ఇవ్వనందున... తనకు ముందుగా ప్రకటించిన టికెట్‌ను భూపతిరెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు. దీనిపై అగ్రమేతలు పునరాలోచించాలని, డబ్బుల కోసం ఇలా సీట్లు అమ్ముకొని జీవితాలతో ఆడుకోవద్దని కోరారు.
'టికెట్లు అమ్ముకొని కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దు' - జీహెచ్ఎంసీ ఎన్నికలు-2020
కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని లంగర్‌హౌస్ కార్పొరేటర్ టికెట్‌ను అమ్ముకున్నారని ఆశావహురాలు పద్మ యాదవ్ ఆరోపించారు. ముందుగా తనకు టికెట్ కేటాయించినప్పటికీ... డబ్బులు ఇవ్వనందున వేరే వాళ్లకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
'టికెట్లు అమ్ముకొని కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దు'