ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జులై 28 రాత్రి వరకు కోనసీమ వ్యాప్తంగా 1,380 పాజిటివ్ కేసు నమోదైనట్లు అమలాపురం డివిజన్ అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ సీహెచ్ పుష్కర రావు వెల్లడించారు.
కోనసీమలో 114 గ్రామాలను చుట్టుముట్టిన కరోనా - ఏపీలో కరోనా కేసుల వార్తలు
ఏపీ కోనసీమ ప్రాంతంలో కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతునే ఉన్నాయి. మంగళవారం రాత్రి వరకు కోనసీమ వ్యాప్తంగా 1,380 కేసుల నమోదైనట్లు అధికారులు తెలిపారు. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
covid
మొత్తం 273 గ్రామ పంచాయతీలు కోనసీమలో ఉన్నాయి. వీటిలో 114 గ్రామాల్లో ఈ మహమ్మారి విస్తరించింది. 139 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. కేసులు పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు పదే పదే సూచిస్తున్నారు.
చదవండి:ఒకేసారి ఒక్కరితో గర్భం దాల్చాలని.. ఆ కవలల వింత కోరిక