తెలంగాణలో ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, థియేటర్లు మూసివేత
16:14 March 14
తెలంగాణలో ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, థియేటర్లు మూసివేత
కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇటలీ నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలడం, మరో ఇద్దరికి లక్షణాలు కనిపించినందున ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, మాల్స్ మూసివేయాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం పరీక్షల సీజన్ అయినందున వాటిని మాత్రం షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారు.
అసెంబ్లీ సమావేశాలను కూడా కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20 వరకు జరగాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సోమవారంతో ముగించాలని నిర్ణయించారు. ఆదివారం సెలవైనా రేపు సభ కార్యక్రమాలు ఉంటాయి. సోమవారం ఆఖరిరోజు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు.
TAGGED:
corona