తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా బాధితురాలి పరారీ.. స్పందించని వైద్య సిబ్బంది - అనంతపురం ఆసుపత్రిలో కరోనా బాధితురాలు వార్తలు

ఏపీలోని అనంతపురం ఆసుపత్రి నుంచి ఓ కరోనా బాధితురాలు బయటకు వెళ్లిపోయింది. ఉరవకొండకు కాలినడకన వెళ్తూ.. మార్గమధ్యలో స్పృహ కోల్పోయింది. విషయాన్ని 108 సిబ్బందికి తెలిపినా ఎవరూ స్పందించలేదు. చివరకు ఎస్పీ ఆదేశాలతో ఎస్సై ఆమెను ప్రైవేటు వాహనంలో ఐసోలేషన్​ వార్డుకు తరలించారు.

కరోనా బాధితురాలి పరారీ.. స్పందించని వైద్య సిబ్బంది
కరోనా బాధితురాలి పరారీ.. స్పందించని వైద్య సిబ్బంది

By

Published : Jul 9, 2020, 12:36 PM IST

కరోనా బాధితురాలు చికిత్స పొందుతూనే... ఎవరికీ చెప్పకుండా ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో జరిగింది. ఉరవకొండకు చెందిన ఓ మహిళకు ఈ నెల 1న కరోనా నిర్ధారణ కావడంతో ఆమెను వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె.... ఈ నెల 3న ఆసుపత్రి సిబ్బందికి చెప్పకుండా 50 కిలోమీటర్ల దూరంలోని ఉరవకొండకు నడిచి వెళ్లింది. నిన్న అర్ధరాత్రి ఉరవకొండకు చేరుకున్న బాధితురాలు.... బస్టాండ్ వద్ద కింద పడి స్పృహ కోల్పోయింది.

సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ధరణిబాబు.. బస్టాండ్‌ వద్దకు చేరుకుని 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. గంట దాటినా 108 వాహన సిబ్బంది స్పందించలేదు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు స్పందించారు. ఉరవకొండ ఎస్సై ధరణిబాబుకు ఫోన్ చేసి తక్షణమే బాధిత మహిళను ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. ఎస్సై ధరణిబాబు అప్పటికప్పుడు ప్రైవేటు వాహనాన్ని తెప్పించి.. మహిళను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

కరోనా బాధితురాలి పరారీ.. స్పందించని వైద్య సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details