తెలంగాణ

telangana

ETV Bharat / city

vaccination: ప్రతి ఏడుగురిలో ఒకరికి టీకా పూర్తి!

ఏపీలో ఇప్పటివరకూ కోటిమందికిపైగా కొవిడ్‌ టీకా వేసినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రతి ఏడుగురిలో ఒకరు కరోనా టీకా ఒకటి లేదా రెండు డోసులు తీసుకున్నారని తెలిపింది.

vaccination in ap, ap vaccination
ఏపీలో వ్యాక్సినేషన్, ఏపీలో టీకా పంపిణీ

By

Published : Jun 2, 2021, 10:11 AM IST

ఆంధ్రప్రదేశ్​ (Andhrapradesh)లో ఇప్పటివరకూ కోటిమందికిపైగా కొవిడ్‌ టీకా (covid vaccine) తీసుకున్నారు. 1,74,471 మందికి డోసులు వేశామని.. వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ తెలిపారు. కొవాగ్జిన్‌ (covaxin), కొవిషీల్డ్‌ (covishield) కలిపి ఇప్పటివరకూ 98,85,650 డోసులను కేంద్రం అందించిందని, 16,85,630 టీకాలను (vaccine) రాష్ట్రం కొనుగోలు చేసిందని వెల్లడించారు.

ఇప్పటివరకూ 82,95,973మందికి కొవిషీల్డ్‌, 17,78,218 మందికి కొవాగ్జిన్‌ డోసులు వేసినట్లు వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ వివరించారు. ఆరోగ్యకార్యకర్తల చిత్తశుద్ధితో ఎక్కడా టీకా వృథా కాలేదని.. దీంతో అదనంగా సుమారు 2 లక్షల మందికి టీకా అందించగలిగామని చెప్పారు. ఏపీలో ప్రతి ఏడుగురిలో ఒకరు కరోనా టీకా ఒకటీ లేదా రెండు డోసులు తీసుకున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:Corona: నెల రోజుల్లో భారీగా తగ్గిన పాజిటివ్‌ కేసులు!

ABOUT THE AUTHOR

...view details