ఏపీలో కరోనా: 9,747 కేసులు.. 67 మరణాలు - ఏపీ కరోనా కేసుల వివరాలు
19:37 August 04
ఏపీలో కరోనా: 9,747 కేసులు.. 67 మరణాలు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 64,147 నమూనాలను పరీక్షించగా 9,747 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,76,333కి చేరింది. వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 79,104 మంది చికిత్స పొందుతుండగా.. 95,625 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇవాళ మరో 67 మంది మృతి చెందగా.. మొత్తం ఇప్పటి వరకు 1,604 మంది ప్రాణాలు విడిచారు.
ఇప్పటి వరకు ఏపీలో21,75,070 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించిది. కొవిడ్ వల్ల మంగళవారం గుంటూరులో 12, కృష్ణాలో తొమ్మిది మంది, కర్నూలులో ఎనిమిది, చిత్తూరులో ఏడుగురు, తూర్పుగోదావరి ఏడుగురు, నెల్లూరులో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఇద్దరు.. ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.