రాష్ట్రంలో మరో 16 మందికి కొవిడ్-19 సోకినట్లు తేలింది. ఫలితంగా బాధితుల సంఖ్య 487కు చేరినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు కరోనాతో 12 మంది మృతి చెందగా 45 మంది కోలుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం 430 మందికి చికిత్స అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఆదిలాబాద్ జిల్లాలో 10 మంది బాధితులున్నట్లు ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు కేసులకు గాను ఇద్దరు కోలుకున్నారని.. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
హైదరాబాద్ జిల్లాలో 200 మందికి వైరస్ సోకగా వారిలో 21 మందికి నయమైందని తెలిపింది. మరో 179 మందికి చికిత్స జరుగుతోందని పేర్కొంది. జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో రెండేసి కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 19 మంది, కామారెడ్డి జిల్లాలో 10 మంది బాధితులున్నట్లు తెలిపారు.
కరీంనగర్‌లో 18 కేసులకు గాను 11 మంది కోలుకోగా ఏడుగురు చికిత్స పొందుతున్నారు. మహబూబాబాద్‌లో ఒక కేసు నమోదైంది. మహబూబ్‌నగర్‌లో 11 కేసులకు గాను ఒకరు కోలుకున్నారుు. మెదక్‌లో ఐదు కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 23 మంది బాధితులకు గాను ఇద్దరికి నయమైందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.