ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వైద్యులు కోవిడ్ –19 పరీక్ష చేశారు. రాష్ట్ర స్థాయి కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాంబాబు సీఎం జగన్ చేతి నుంచి రక్త నమూనాలు సేకరించారు. దక్షిణ కొరియా నుంచి నేడు ఏపీకి లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయి. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ కిట్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఈ కిట్లతోనే ముఖ్యమంత్రి జగన్‌కు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో కరోనా వైరస్ లేనట్లుగా ఫలితం వచ్చింది. ర్యాపిడ్ టెస్టు కిట్ ద్వారా కేవలం పది నిముషాల్లోనే ఫలితం వచ్చిందని సీఎంవో కార్యాలయం వెల్లడించింది.
ఏపీ సీఎం జగన్‌కు కరోనా పరీక్ష... నెగిటివ్‌గా నిర్ధరణ - ఏపీ కరోనా అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు వైద్యులు కోవిడ్-19 పరీక్ష నిర్వహించారు. ఫలితాల్లో నెగిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో ఇవాళ రాష్ట్రానికి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లు వచ్చాయి. వాటి పరిశీలనలో భాగంగా సీఎం జగన్ తొలిసారిగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు.
కొవిడ్-19 ఫలితాల్లో ఏపీ సీఎంకు నెగిటివ్