విద్యార్థులపై కరోనా పంజా.. 40 మందిలో లక్షణాలు - Corona Cases in AP
![విద్యార్థులపై కరోనా పంజా.. 40 మందిలో లక్షణాలు corona cases in AP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15644448-thumbnail-3x2-a.jpg)
12:18 June 24
ఏపీలో కరోనా కలకలం.. 40 మంది విద్యార్థుల్లో లక్షణాలు
Corona Cases in Kakinada : కరోనా మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకు భారీ సంఖ్యలో కేసులు నమోదవుతు ప్రజల్లో మళ్లీ భయం పుట్టిస్తోంది. ముఖ్యంగా పిల్లలపై తన పంజాను విసురుతూ ఇప్పుడిప్పుడే పాఠశాలలకు వెళ్తున్న వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్‌కేఆర్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది.
పాఠశాలలో 40 మంది ఎన్‌సీసీ విద్యార్థుల్లో కరోనా లక్షణాలు గుర్తించారు. జిల్లా అధికారులు వారిని ఐసోలేషన్‌లో ఉంచారు. ఎన్‌సీసీ క్యాంపు మొత్తంలో 317 మంది విద్యార్థులున్నారు. ఈనెల 18 నుంచి ఈ క్యాంపు మొదలైంది. 40 మందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచి మిగతా వారిని ఇళ్లకు పంపించారు. కొద్దిరోజుల పాటు క్యాంపును నిలిపివేశారు. కరోనా పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత క్యాంపు కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.