దిల్లిలోని మర్కజ్లో ప్రార్థనలకు వెళ్లిన వారిలో 8 మందిని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో గుర్తించారు. వీరిని పరీక్షల నిమిత్తం క్వారంటైన్‌కు తరలించారు. మతప్రచారం కోసం అక్కడికి వెళ్లిన వారిలో కరోనా బాధితులు ఉన్నట్టు తేలినందున పోలీసు, వైద్య బృందాలు అప్రమత్తమయ్యాయి.
కరోనా అనుమానితులు క్వారంటైన్‌కు తరలింపు - క్వారంటైన్‌కు తరలింపు
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని ఎనిమిది మంది కరోనా అనుమానితులను రాజేంద్రనగర్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. వీరు దిల్లీలోని మర్కజ్లో ప్రార్థనలకు హాజరైనట్టు పోలీసులు, వైద్యాధికారులు తెలిపారు.

కరోనా అనుమానితులు క్వారంటైన్‌కు తరలింపు
నియోజకవర్గంలో విచారణ నిర్వహించగా... షాద్‌నగర్‌లో ముగ్గురు, కొత్తూరులో ముగ్గురు, నందిగామలో ఇద్దరు ఉన్నట్టు తేలింది. వీరిని వెంటనే పరీక్షల నిమిత్తం రాజేంద్రనగర్‌లోని క్వారంటైన్‌కు తరలించినట్టు జిల్లా ఉప వైద్యాధికారి చందునాయక్ తెలిపారు.
కరోనా అనుమానితులు క్వారంటైన్‌కు తరలింపు
ఇవీచూడండి:తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య