సింగపూర్ నుంచి వచ్చి హోమ్ క్వారంటైన్లో ఉండకుండా అర్ధరాత్రి వరకు చిందులేసిన ఓ మహిళపై బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్‌కు చెందిన ఆమె కొంతకాలంగా భర్త, పిల్లలతో కలిసి సింగపూర్‌లో స్థిరపడింది. సెలవులపై నాలుగు రోజుల క్రితం నగరానికి వచ్చింది. విమానాశ్రయంలో అధికారులు కరోనా పరీక్షలు చేసి చేతిపై ముద్ర వేసి హోం క్వారంటైన్‌లోనే ఉండాలని చెప్పి పంపారు.
క్వారంటైన్ ముద్ర వేసినా లెక్కచేయకుండా చిందులేసింది! - corona suspect njoy with boy
హోమ్ క్వారంటైన్ ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి కటకటాల పాలైంది ఓ మహిళ. సింగపూర్ నుంచి వచ్చిన ఆమెను 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. కానీ లెక్కచేయకుండా ప్రియుడితో కలిసి చిందులేసింది. అపార్టుమెంటు వాసులు చూసి పోలీసులకు పట్టించారు.
ఆమె స్వస్థలానికి చేరుకోకుండా ఓల్డ్ బోయిన్పల్లి రాజారెడ్డి కాలనీలో గల సాయిరెసిడెన్సీలో ఓ ఫ్లాట్‌కు చేరుకుంది. ఓ యువకుడితో కలిసి ఆదివారం నాడు అర్ధరాత్రి వరకు పార్టీ చేసుకుంది. మద్యం తాగి ఇష్టానుసారంగా చిందులేసింది. గమనించిన అపార్ట్మెంటు వాసులు సోమవారం సాయంత్రం మహిళను నిలదీశారు. ఆ సమయంలోనే ఆమె చేతికి క్వారంటైన్ స్టాంప్ గమనించారు. వెంటనే బంధించి పోలీసులకు సమాచారం అందించారు.
మహిళను, యువకుడిని పోలీసులు విచారించగా... అతను బాయ్‌ఫ్రెండ్ అని తేలింది. వారిద్దరిపై కేసు నమోదు చేసి ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఆ ఫ్లాట్ ఎవరిది? అక్కడ ఆమె ఇంకా ఏం చేసింది? ఎవరెవరిని కలిసింది? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.