గ్రేటర్ హైదరాబాద్లోని బస్తీల్లో కరోనా పంజా విసురుతోంది. పాతబస్తీతోపాటు సికింద్రాబాద్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లోని చిన్న బస్తీలు, ఇరుకు గల్లీల్లో కేసులు సంఖ్య పెరుగుతోంది. జనం రద్దీ ఎక్కువగా ఉండటంతో పాటు.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వైరస్ వ్యాపిస్తోంది. కొన్ని బస్తీల్లో సామూహిక మరుగుదొడ్లను వినియోగిస్తుండడం ఇందుకు కారణమవుతోంది.
గత వారం రోజుల్లో కేసులు | |
తేదీ | కేసుల సంఖ్య |
జులై 30 | 586 |
జులై 31 | 578 |
ఆగస్టు 1 | 517 |
ఆగస్టు 2 | 273 |
ఆగస్టు 3 | 391 |
ఆగస్టు 4 | 532 |
ఆగస్టు 5 | 535 |
ముషీరాబాద్, గోషామహల్, భోలక్‌పూర్, అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో ఇరుకైన గల్లీల్లో జనాల మధ్య ఎడం తక్కువగా ఉంటోంది. ఇళ్లన్నీ పక్కనే పక్కనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితులూ వైరస్ వ్యాప్తికి దారితీస్తున్నాయి. ఇక్కడ కరోనా సోకిన వ్యక్తులను హోం ఐసోలేషన్ కంటే...ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించడమే మేలు. ఇంటింటికి తిరిగి సర్వే చేసి బాధితులను గుర్తించి కట్టడి చేయాల్సి బాధ్యత స్థానిక వైద్య ఆరోగ్య శాఖపై ఉంది. పరిశుభ్రతపై జీహెచ్‌ఎంసీ దృష్టిపెట్టి క్రిమి సంహారక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.