తెలంగాణ

telangana

చేపల మార్కెట్​ వద్ద సందడి.. పోలీసుల ప్రత్యేక దృష్టి

By

Published : May 23, 2021, 10:53 AM IST

కరోనా వ్యాప్తి కట్టడికి లాక్​డౌన్ విధించినా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం నిబంధనలు పక్కాగా అమలవ్వడం లేదు. ముఖ్యంగా మార్కెట్​కు ప్రజలు గుంపులుగుంపులుగా తరలిరావడం వల్ల వైరస్ వాహకాలుగా మారుతున్నారు. హైదరాబాద్​లోని ముషీరాబాద్​ చేపల మార్కెట్​కు ఆదివారం కావడం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

fish market , rush at fish market
చేపల మార్కెట్, ముషీరాబాద్ చేపల మార్కెట్

రాష్ట్రంలో లాక్​డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రజలు గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు. ముఖ్యంగా మార్కెట్లలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. ఆదివారం కావడం వల్ల హైదరాబాద్​లోని ముషీరాబాద్ చేపల మార్కెట్​కు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.

ముషీరాబాద్ చేపల మార్కెట్​లో రద్దీ

కొద్దిరోజులుగా మార్కెట్​ వద్ద కరోనా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లోనే వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని తెలిపారు. అధికారులు చొరవ చూపి ప్రజలు గుమిగూడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

చేపల మార్కెట్, ముషీరాబాద్ చేపల మార్కెట్

మార్కెట్​లో కరోనా నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని.. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో.. ముషీరాబాద్ చేపల మార్కెట్​పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉదయం 5 గంటల నుంచి మార్కెట్​కు వచ్చే వాహనాలను బయటే నిలిపివేశారు. భౌతిక దూరం పాటించని కొనుగోలుదారులను, నిబంధనలు ఉల్లంఘించిన విక్రయదారులను హెచ్చరించిన పోలీసులు జరిమానా విధించారు.

ABOUT THE AUTHOR

...view details