తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనాపై కేరళ అస్త్రం.. ముందస్తు ప్రణాళికే మంత్రం - corona prevention measures in kerala

మూడున్నర కోట్ల జనాభా కలిగిన ఆ రాష్ట్రంలో ప్రతిరోజు 40వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పాజిటివ్ రేటు చాలా ఎక్కువైనా.. అక్కడ మరణాల సంఖ్య చాలా తక్కువ. కరోనా కట్టడిలో కేరళ మెరుగైన స్థితిలో ఉండటానికి తోడ్పడుతోన్న అంశాలంటో ఆ ప్రభుత్వం నియమించిన త్రీమెన్ కమిటీ సభ్యుడిగా ఉన్న యువ ఐఏఎస్ మైలవరపు తేజతో ఈటీవీ భారత్ ముఖాముఖి..

ias krishna teja, krishna teja in kerala
కృష్ణ తేజ, ఐఏఎస్ కృష్ణ తేజ

By

Published : May 15, 2021, 10:44 AM IST

ఆ రాష్ట్రంలో దాదాపు మూడున్నర కోట్ల జనాభా... రోజూ వెలుగుచూస్తున్న పాజిటివ్‌ కేసులు 40వేలకుపైనే. మిగతా రాష్ట్రాలతో పోల్చితే పాజిటివ్‌ రేటు చాలా ఎక్కువ. అయినా, అక్కడ ఆక్సిజన్‌ కొరత లేదు... రెమిడిసివర్‌ బ్లాక్‌ మార్కెట్‌ దందా లేదు. ఆసుపత్రి బిల్లుల మోత లేదు.... చితి మంటల ఆర్తనాదాలు లేవు. టీకాల కొరత అసలు లేనేలేదు. ఆ రాష్ట్రమే....కేరళ. విదేశాల్లో స్థిరపడిన కేరళీయుల నుంచి ఆర్థికసహకారాన్ని ఆహ్వానిస్తూ చేపట్టిన కార్యక్రమం సైతం అక్కడ సత్ఫలితాలు ఇస్తోంది. ఆ కమిటీకి రాష్ట్ర నోడల్ ఆఫీసర్​గా ప్రభుత్వం నియమించిన త్రీమెన్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు...యువ ఐఏఎస్ మైలవరపు కృష్ణతేజ. ఈ నేపథ్యంలో... కరోనా కట్టడిలో కేరళ మెరుగైన స్థితిలో ఉండటానికి దోహదం చేస్తున్న అంశాలేంటి..? విద్యావంతులు అధికంగా ఉండటమే కారణమా..? అసలు, కేరళ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రణాళికలు ఏంటి..? వంటి ఆసక్తికర విషయాలెన్నో ఆ తెలుగు తేజం మాటల్లోనే విందాం...

కరోనాపై కేరళ అస్త్రం

ABOUT THE AUTHOR

...view details