తెలంగాణ

telangana

ETV Bharat / city

corona cases in RIMS: రిమ్స్‌లో కరోనా కలకలం.. 50 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్

corona cases in RIMS: ఏపీలో కరోనా మరోసారి కోరలు చాస్తోంది. రోజురోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సాధారణ ప్రజలనే కాకుండా.. వైద్య విద్యార్థులను కూడా మహమ్మారి వదలట్లేదు. ఏకంగా 50 మంది వైద్యవిద్యార్థులకు ఒక్కసారే కరోనా సోకింది.

corona cases in RIMS
corona cases in RIMS

By

Published : Jan 17, 2022, 3:08 PM IST

Updated : Jan 17, 2022, 5:17 PM IST

corona cases in RIMS: ఏపీలోని కడప రిమ్స్‌లో కరోనా కలకలం రేపింది. కళాశాలలోని 50 మంది వైద్య విద్యార్థులకు కొవిడ్ సోకింది. ఎన్టీఆర్‌ వర్సిటీ ఆధ్వర్యంలో రేపు ఎంబీబీఎస్‌ ఫైనల్‌ పరీక్షలు జరగనుండగా.. 150 మంది వైద్య విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 50 మంది వైద్య విద్యార్థులు కొవిడ్ బారినపడగా.. మరికొంత మంది విద్యార్థుల నివేదికలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రేపటి పరీక్షలు వాయిదా వేయాలని వైద్య కళాశాల యాజమాన్యం ఎన్టీఆర్‌ వర్సిటీని కోరింది.

NTR Health University MBBS Exams: 50 మంది విద్యార్థులకు కరోనా సోకడంతో.. రేపు జరిగే ఫైనల్​ పరీక్షను వాయిదా వేయాలని మిగతా విద్యార్థులు కోరారు. అయితే.. పరీక్షలను వాయిదా వేయలేమని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పాజిటివ్ విద్యార్థులను ప్రత్యేక గదుల్లో ఉంచి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షల వాయిదాపై రాతపూర్వక అభ్యర్థన రాలేదని వర్సిటీ రిజిస్ట్రార్‌ చెప్పారు.

"కరోనా దృష్ట్యా పరీక్షలు వాయిదా వేయాలని ఫోన్లు వచ్చాయి. పరీక్షల వాయిదాపై రాతపూర్వక అభ్యర్థన రాలేదు. మంగళవారం వైద్య విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. కరోనా సోకినవారికి ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహించాలి. పరీక్షలు నిర్వహించేలా కళాశాల ప్రిన్సిపల్ చూడాలి. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరీక్షలు వాయిదా వేయలేం"- రిజిస్ట్రార్, ఎన్టీఆర్ వర్సిటీ

దేశంలో కరోనా కేసులు..

Corona cases in India: మరోవైపు భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. ఒక్కరోజే.. 2,58,089 లక్షల కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 385 మంది మరణించారు. 1,51,740 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.65 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు:3,73,80,253
  • మొత్తం మరణాలు:4,86,451
  • యాక్టివ్ కేసులు:16,56,341
  • మొత్తం కోలుకున్నవారు:3,52,37,461

Omicron Cases In India

దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,209కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 39,46,348 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,57,20,41,825 కు చేరింది.

అంతర్జాతీయంగా..

corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 19,39,895 మందికి కరోనా సోకింది. 3,990 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 32,86,75,541కు చేరగా.. మరణాలు 55,57,594కు పెరిగింది.

  • అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 2,87,973 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 346 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6.6 కోట్లు దాటింది.
  • ఫ్రాన్స్​లో ఒక్కరోజే 2,78,129 కేసులు వెలుగుచూశాయి. మరో 98 మంది చనిపోయారు.
  • బ్రిటన్​లో మరో 70,924 మంది వైరస్ బారిన పడ్డారు.​ 88 మంది మృతి చెందారు.
  • ఇటలీలో 1,49,512 కొత్త కేసులు బయటపడగా.. 248 మంది మరణించారు.
  • టర్కీ​లో 54,100 మందికి కొత్తగా వైరస్​ సోకింది. మరో 136 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి

Last Updated : Jan 17, 2022, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details