తెలంగాణలో మరో 1,897 కరోనా పాజిటివ్ కేసులు - corona news in telangana
08:52 August 12
తెలంగాణలో మరో 1,897 కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 84,544కు చేరుకుంది. మరో 9 మంది మరణించగా... మృతుల సంఖ్య 654కు చేరింది. ఇప్పటి వరకు వైరస్ నుంచి 61,294 మంది కోలుకొని ఇంటికెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 22,596 మంది చికిత్స పొందుతున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 479 కరోనా కేసులు నమోదు కాగా... రంగారెడ్డిలో 162, మేడ్చల్ మల్కాజిగిరి 172, వరంగల్ అర్బన్ 87, కరీంనగర్ 64, ఖమ్మం 63, సిద్దిపేట, పెద్దపల్లిలో 62 చొప్పున వచ్చాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 72.49 శాతం, మరణాల రేటు 0.77శాతం ఉంది.