గ్రేటర్ పరిధిలో కరోనా కోరలు చాస్తోంది. ప్రాంతాలతో నిమిత్తం లేకుండా... నగర నలుమూలలా విస్తరిస్తోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎస్ఎస్బీ నగర్లో 66 ఏళ్ల వృద్ధురాలికి, అల్వీన్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి, చింతల్ వాణీ నగర్లో మరో మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి కరోనా లక్షణాలతో వచ్చిన 11 మందికి పరీక్షలు నిర్వహించారు. సోమవారం నాడు 25 మందికి పరీక్షలు నిర్వహించగా... ఐదుగురికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. మరో ఐదుగురి రిపోర్ట్లు అందాల్సి ఉందని ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు.
కరోనాతో వ్యక్తి మృతి
అంబర్పేట్ డీడీ కాలనీలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థికి, బాగ్ అంబర్పేట్ తురబ్నగర్లో కిరాణ షాపు నిర్వహించే ఓ వ్యక్తికి, అంబర్‌పేట్‌లో చెన్నారెడ్డి మరో వ్యక్తికి, ఇదే నియోజకవర్గంలో ఓ గృహిణికి కరోనా కరోనా సోకినట్టు వైద్యులు తెలిపారు. ముషీరాబాద్ నియోజవర్గం పద్మశాలి కాలనీలో కరోనా వైరస్‌తో ఓ వ్యక్తి మృతిచెందగా... ఆర్ఎంపీ వైద్యుడికి, 73 ఓ ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.