తెలంగాణ

telangana

ETV Bharat / city

బ్రిటన్‌ ప్రయాణికుల్లో ‘పాజిటివ్‌’ కలకలం - hyderabad corona cases

బ్రిటన్​ నుంచి నగరానికి వస్తున్న ప్రయాణికుల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవటం ఇప్పడు చర్చనీయాంశమైంది. లాక్​డౌన్​ తర్వత నుంచి ఇప్పటి వరకు ఏడు విమానాలు బ్రిటన్‌ నుంచి హైదరాబాద్‌కు రాగా, 5 విమానాల్లో ప్రయాణించిన 15 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అవటం ప్రయాణికులందరినీ భయాందోళనలకు గురిచేస్తోంది.

corona positive cases in britan passengers
corona positive cases in britain passengers

By

Published : Jan 27, 2021, 7:37 AM IST

బ్రిటన్‌ నుంచి హైదరాబాద్​కు వచ్చే విమానాల్లోని ప్రయాణికుల్లో పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తున్నాయి. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కూర్చున్న సీటు ముందూ, వెనుక మూడు వరుసలలోని ప్రయాణికులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఏడు విమానాలు బ్రిటన్‌ నుంచి హైదరాబాద్‌కు రాగా, 5 విమానాల్లో ప్రయాణించిన 15 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. కేంద్రం ఈ నెల 8 నుంచి బ్రిటన్‌ విమానాల రాకపోకలకు అనుమతించింది. రద్దీని బట్టి వారానికి ఒకటి లేదా రెండు విమానాలను బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ లండన్‌లోని హిత్రో విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ జీఎంఆర్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడుపుతోంది. వాస్తవానికి ఆయా ప్రయాణికులు ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకుని ఉండాలి. నెగిటివ్‌ వస్తేనే ప్రయాణానికి అనుమతిస్తారు.

అక్కడ నెగిటివ్‌.. ఇక్కడ పాజిటివ్‌..

శంషాబాద్‌లో దిగిన తర్వాత బ్రిటన్‌ నుంచి వచ్చిన ప్రయాణికులందరికీ కొవిడ్‌-19 పరీక్షలు చేస్తున్నారు. పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన ప్రయాణికులను నేరుగా ఇంటికి పంపించి 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. బ్రిటన్‌లో చేయించుకున్న టెస్టులో నెగిటివ్‌ వచ్చినప్పటికీ, ఇక్కడికి వచ్చాక చేసిన టెస్టుల్లో కొందరికి పాజిటివ్‌ వస్తోంది. ఇలా పాజిటివ్‌ వచ్చిన 15 మందిని నేరుగా గచ్చిబౌలిలోని టిమ్స్‌కు పంపించారు. వారితో దగ్గరగా ప్రయాణించిన దాదాపు 300 మందిని క్వారంటైన్‌కు తరలించారు.

ఉదయం వస్తే... వెళ్లేది సాయంత్రమే..

విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహించేందుకు ఒక్క కొవిడ్‌ పరీక్ష కేంద్రాన్నే ఏర్పాటు చేశారు. దీనివల్ల ఆర్టీపీసీఆర్‌ పరీక్షలలో జాప్యం జరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. తాజాగా ఆదివారం బ్రిటన్‌ నుంచి వచ్చిన విమానంలో 270 మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఉదయం 7.30గంటలకు విమానం రాగా... అందరికీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వచ్చేసరికి తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. కొందరు ప్రయాణికులు వెళ్లేసరికి సాయంత్రం ఐదు దాటింది.

ఇదీ చూడండి:'దుష్ప్రచారం.. వైరస్‌ కన్నా ప్రమాదకరం'

ABOUT THE AUTHOR

...view details