ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 41,871 పరీక్షలు నిర్వహించారు. 10,759 కేసులు నిర్ధరణ కాగా 31 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 3,992 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 66,944 కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
జిల్లాల వారీగా కేసులు..
గడచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,474 కరోనా కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం 1,336, గుంటూరు 1,186, తూర్పుగోదావరి 992, కర్నూలు 1,367, విశాఖ 844, కృష్ణా 679, విజయనగరం 562, ప్రకాశం 345, కడప 279, నెల్లూరు 816, అనంతపురం 789, పశ్చిమగోదావరి 90 చొప్పున కేసులు నమోదయ్యాయి.