ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 22 వేల 399 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 18 వేల 638 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం 2 లక్షల వెయ్యి 42 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కొవిడ్ కాటుకు 89 మంది బలయ్యారు.
ఏపీలో కొత్తగా 22వేల 399 కరోనా కేసులు.. 89 మంది బలి - నేడు రాష్ట్రంలో కొవిడ్ మరణాలు
ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 96 వేల 446 కరోనా పరీక్షలు నిర్వహించగా... 22 వేల 399 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మహమ్మారికి 89 మంది బలయ్యారు.
corona cases
కరోనాతో విశాఖ, విజయనగరం జిల్లాల్లో 11 మంది చొప్పున మృతి చెందారు. కరోనాతో చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో 9 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 8 మంది చొప్పున బలయ్యారు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 96 వేల 446 కరోనా పరీక్షలు నిర్వహించారు.