తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉప్పరపాలెం.. కరోనా దరి చేరని గ్రామం - ఉప్పరపాలెం తాజావార్తలు

ఏపీలోని పలు గ్రామాలు కరోనా కోరల్లో చిక్కుకొని అల్లాడుతున్నాయి. సెకండ్‌ వేవ్‌ విజృంభించడంతో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. పలుచోట్ల ఆత్మీయులు, కుటుంబ సభ్యులను కోల్పోయి రోదిస్తున్నారు. ఎవరి నోట విన్నా, మాట్లాడినా కరోనా గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణంతో పాటు గ్రామాలను వణికిస్తున్న కరోనా.. కొన్ని కుటుంబాలను కోలుకోలేని దెబ్బతీసింది. అయితే గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని ఓ గ్రామంలో ఒక్క కొవిడ్​ కేసు రాలేదు. అదెలా సాధ్యమైందంటే..

corona free village upparapalem
కరోనా లేని గ్రామంగా ఉప్పరపాలెం

By

Published : May 24, 2021, 2:30 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. గ్రామస్థులంతా ఒకే మాటపై నిలిచి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఇప్పటి దాకా గ్రామంలో ఒక్క కొవిడ్​ కేసు కూడా నమోదు లేదు. గ్రామంలో 826 కుటుంబాలు ఉండగా.. 3028 మంది మహమ్మారి బారిన పడకుండా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు.

అందరి బాట.. ఒకే మాట.

అధికారులు, గ్రామస్థులు సమన్వయంతో వ్యవహరిస్తూ కొవిడ్‌ కేసులు రాకుండా తగిన జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తుండగా, పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామస్థులంతా సహకరిస్తూ నిబంధనలు పాటిస్తున్నారు. మొదటి దశలో కరోనా వచ్చినప్పటి నుంచి నేటి వరకు గ్రామస్థులు స్వీయ రక్షణ చర్యలు చేపట్టారు. బయటి వ్యక్తులు గ్రామంలోకి వచ్చినపుడు అప్రమత్తంగా ఉండి వెళ్లే దాకా జాగ్రత్తలు తీసుకోవటం, అత్యవసరమైతే తప్ప గ్రామం నుంచి బయటకు వెళ్లకపోవడం, గ్రామం మొత్తం ఒకే మాట మీద నిలబడటంతో కేసులు రాకుండా కట్టడి చేయగలిగారు.

గ్రామస్థుల సహకారంతోనే సాధ్యమైంది

మొదటి, రెండో దశల్లో నేటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడానికి గ్రామస్థులతో పాటు సంబంధిత అధికారుల కృషి ఉంది. మొదటి దశలో గ్రామ ప్రత్యేకాధికారి డిప్యూటీ తహసీల్దార్‌, ఎంపీడీవోతో పాటు సర్పంచి గోపు కృష్ణ, గ్రామస్థులు, వైద్య సిబ్బంది, యువత సహకారంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. నిత్యం పారిశుద్ధ్య పనులు చేపట్టడం, మాస్కులు ధరించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇలా అందరి సహకారంతోనే సాధ్యమైంది. - భాగ్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి

ఇదీ చదవండి:కాళ్లకు బొబ్బలెక్కినా.. నడక ఆగదు..

ABOUT THE AUTHOR

...view details